Bonda Uma: ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌తో మేం బాధ‌ప‌డాలి కానీ మీకేంటి?

Bonda Uma: జ‌న‌సేన‌ (janasena), తెలుగు దేశం పార్టీలు (TDP) ఎప్పుడు పొత్తును విర‌మించుకుంటాయా ఎప్పుడు బ్రేక్ అవుతాయా అని YSRCP నేత‌లు కుక్క‌ల్లా కాచుకుని కూర్చున్నార‌ని మండిప‌డ్డారు నేత బోండా ఉమ‌. చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ఒక సీటు ప్ర‌క‌టించిన‌ప్పుడు తాను కోరుకున్న రెండు సీట్ల‌ను ప‌వ‌న్ (pawan kalyan) ప్ర‌క‌టించ‌డంలో త‌ప్పు ఏముంద‌ని ఉమ ప్ర‌శ్నించారు. ఈ మాత్రం దానికే కావాల‌ని ఇరు పార్టీల నేత‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు YSRCP నేత‌లు య‌త్నిస్తున్నార‌ని ఇది ప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సీట్ల‌తో బాధ‌ప‌డితే తాము బాధ‌ప‌డాలి కానీ YSRCP నేత‌ల‌కు వ‌చ్చిన నొప్పి ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప‌వన్ ప్ర‌క‌టించిన సీట్ల‌తో త‌మ‌కు ఎలాంటి బాధ లేద‌ని.. అంద‌రూ సంతోషంగానే ఉన్నార‌ని తెలిపారు.