Bolisetty Srinivas: అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ లేరు.. మెగా ఫ్యాన్స్ అండ మాత్ర‌మే ఉంది

Bolisetty Srinivas slams allu arjun

Bolisetty Srinivas: జ‌న‌సేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్‌పై షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. మొన్న మారుతి న‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ అతిథిగా వెళ్లారు. ఆ స‌మ‌యంలో త‌న‌కు న‌చ్చితేనే ఎవ‌రి కోసమైనా ఎక్క‌డికైనా వ‌స్తాన‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ జ‌న‌సేన‌కు స‌పోర్ట్ చేయ‌కుండా వైఎస్సార్ కాంగ్రెస్ నేత శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి కోసం వెళ్లి మ‌రీ ప్ర‌చారం చేయ‌డం ఎంత తీవ్ర దుమారానికి దారి తీసిందో తెలిసిందే.

దీనిపై మొన్న అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తూ త‌న‌కు న‌చ్చితేనే ఎవ‌రి కోస‌మైనా ఎక్క‌డికైనా వెళ్తాను అన్నారు. దీనిపై బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లు అర్జున యాటిట్యూడ్‌పై మండిప‌డ్డారు.  “” నేను పెద్ద పుడుంగిని.. ఇష్టమయితనే వస్తా అంటున్నావ్ క‌దా..! నువ్వు పెద్ద పుడింగివా? రాక‌పోతే మానేయ్. వెల్లిపో. ఎవరు అడిగారు నిన్ను? మేం 21కి 21 గెలిచాం. నువ్వు వెళ్లిన YCP MLAని గెలిపించావా? మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు గెలిపించావా? అల్లు అర్జున్ కంటూ ఫాన్స్ లేరు. ఉంది మెగా ఫ్యాన్సే, ఆయన ఊహించుకుటున్నాడేమో త‌న‌కు అభిమానులు ఉన్నార‌ని “” అంటూ రెచ్చిపోయారు శ్రీనివాస్.