No Confidence Motion: ఇది BJPకి జుజుబీ..!

Delhi: BJP పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని (no confidence motion) ఎదుర్కోనుంది. మ‌ణిపూర్ అంశాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పార్ల‌మెంట్‌లో చ‌ర్చించాల్సిందేన‌ని అపోజిష‌న్ కూట‌మి I-N-D-I-A.. బీజేపీకి అవిశ్వాస తీర్మాన నోటీసులు పంపించింది. BJPకి నోటీసులు పంపిన పార్టీల్లో తెలంగాణ ప్ర‌భుత్వం (BRS) కూడా ఉంది. ఇందుకు స్పీక‌ర్ ఓం బిర్లా కూడా అనుమ‌తులు ఇచ్చారు.

ఇంత‌కీ ఎందుకు ఈ అవిశ్వాస తీర్మానం? 

మణిపూర్‌లో గ‌త మూడు నెల‌లుగా హింస జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. మిజోరాం నుంచి మ‌ణిపూర్‌లోకి అక్రమంగా చొర‌బ‌డుతున్నారు. దాంతో అది మ‌రిన్ని అల్ల‌ర్లకు దారితీస్తోంది. పైగా ఇటీవ‌ల ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించి రేప్ చేసి మ‌రీ చంపేసిన ఘ‌ట‌న దేశాన్ని కుదిపేసింది. దాంతో పార్ల‌మెంట్‌లో మోదీ ఈ అంశం గురించి చ‌ర్చించ‌డం లేద‌ని, 3 నెల‌లు అవుతున్నా మ‌ణిపూర్‌లో శాంతి భ‌ద్ర‌త‌లు మెరుగుప‌డ‌టంలేద‌ని అపోజిష‌న్ కూట‌మి ఆరోప‌ణ‌లు చేసింది. కాబ‌ట్టి అవిశ్వాస తీర్మానం (no confidence motion) పెడితే అస‌లు కేంద్రం మ‌ణిపూర్ గొడ‌వ‌ల‌ను ఆప‌గ‌లుగుతుందా లేదా అనే విష‌యం తెలిసిపోతుంది.

ఎంత మంది స‌పోర్ట్ ఉంది? 

నిజానికి ఈ అవిశ్వాస తీర్మాన ప‌రీక్ష అనేది BJPకి జుజుబీ లాంటిద‌నే చెప్పాలి. ఎందుకంటే పార్ల‌మెంట్‌లో NDA కూట‌మికి మేజారిటీ స‌పోర్ట్ ఉంది. అంటే 331 స‌భ్యుల స‌పోర్ట్ BJPకి ఉంది. లోక్ స‌భ నుంచే 272 స‌భ్యుల స‌పోర్ట్ NDAకు ఉంది. అలాంట‌ప్పుడు అవిశ్వాస తీర్మాన ప‌రీక్ష‌లో (no confidence motion) BJP ఇట్టే గెలిచేస్తుంది. ఒక‌వేళ ఎన్డీయేకి మెజార్టీ సపోర్ట్ లేక‌పోతే మాత్రం ప్ర‌భుత్వం నిట్ట‌నిలువున కూలిపోతుంది. కానీ INDIAకు కేవ‌లం 144 పార్టీల స‌పోర్ట్ మాత్ర‌మే ఉంది. వాటిలో bRS, YSRCP, BJP ఉన్నాయి.

అపోజిష‌న్‌కు ఆయుధం 

ఈ అవిశ్వాస తీర్మానం అనేది అపోజిష‌న్ పార్టీల‌కు అయుధం లాంటిది. ఈ తీర్మానం ద్వారా అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌చ్చు. ఒక‌వేళ అవిశ్వాస తీర్మాన ప‌రీక్ష‌లో అపోజిష‌న్ గెలిస్తే మాత్రం అధికారం ప్ర‌భుత్వంలో ఉన్న‌వారంతా రిజైన్ చేసేయాల్సిందే. దీనిని లోక్‌స‌భ‌లో మాత్ర‌మే ప్ర‌వేశ‌పెట్టాలి. పార్ల‌మెంట్‌లోని ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీపై అవిశ్వాస తీర్మాన ప‌రీక్ష‌ను పెట్ట‌చ్చు. ఆ ప‌రీక్ష‌లో త‌మ బ‌లం ఎంతో నిరూపించుకుని తీరాల్సిందే.

అవిశ్వాస తీర్మాన పరీక్ష పెట్టే విధానం 

లోక్ స‌భ రూల్స్ ఆధారంగా ఈ అవిశ్వాస తీర్మాన పరీక్ష పెట్టాలి. రూల్స్ 198(1), 198(5) ప్ర‌కారం స్పీక‌ర్‌కి స‌మ్మ‌త‌మైతేనే ఈ పరీక్ష పెట్టాలి. ఉద‌యం 10 గంట‌ల‌కు అవిశ్వాస తీర్మాన ప‌రీక్ష ఏ విష‌యంపై పెట్టాల‌నుకుంటున్నారో ముందుగానే రాత‌పూర్వ‌కంగా సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కి స‌బ్మిట్ చేయాలి. ఈ ప‌రీక్ష పెట్టాల‌నుకున్నప్పుడు ఆ పార్టీ నుంచి 50 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు ఉండితీరాలి. ప‌రీక్ష పెట్టాక అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం బ‌ల‌ప‌రీక్ష‌ను నిరూపించుకోవాలి. లేదా వేరే ప్ర‌భుత్వం అమ‌ల్లోకి వ‌స్తుంది.