BJP: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదు
ముందస్తు ఎన్నికలకు (early elections) వెళ్లే యోచలే లేదని BJP క్లారిటీ ఇచ్చేసింది. పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ఎజెండా కూడా డిసైడ్ చేయలేదని BJP పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ లక్ష్మణ్ (k lakshman) వెల్లడించారు. గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ఇచ్చిన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని ఇంకా రెండు సమస్యలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటిలో ఒకటి ఉమ్మడి పౌరస్మృతి, రెండోది ఒక దేశం ఒక ఎన్నికలు మాత్రమేనని వెల్లడించారు. ఉమ్మడి పౌరస్మృతి (uniform civil code) అమలు చేయాలని దేశంలోని 99% మంది అభిప్రాయపడుతున్నారని అన్నారు. త్వరలో ఈ రెండింటినీ అమలు చేసి తీరతామని తెలిపారు.