TDP BJP Janasena: బాలయ్యకు షాక్.. BJPకి హిందూపురం సీట్?

TDP BJP Janasena: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (AP Elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party), జ‌నసేన‌తో (Jnasena) క‌లిసేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ (Bharatiya Janata Party) మొత్తానికి ఒప్పేసుకుంది. తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీ అధినేత‌లు చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu), ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు (Pawan Kalyan) మూడు రోజుల పాటు ఢిల్లీలో కేంద్ర‌మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డాల‌తో సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపారు.

పొత్తులో ఒక ట్విస్ట్ బ‌య‌టికి వ‌చ్చింది. తెలుగు దేశం పార్టీ నుంచి హిందూపురం (Hindupur) సీటు ఎప్పుడూ కూడా నంద‌మూరి బాల‌కృష్ణ‌కే (Nandamuri Balakrishna) ద‌క్కుతూ వ‌చ్చింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నంద‌మూరి నట‌సింహాన్ని కొట్టేవాడే లేడు. హిందూపురం తెలుగు దేశం పార్టీకి కంచుకోట లాంటిది. అలాంటి సీటును భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మ‌కు ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీ చాలా సులువుగా గెలిచే నియోజ‌క‌వ‌ర్గాల‌నే భార‌తీయ జ‌న‌తా పార్టీ కోరింది. ఇందుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ప్ప‌క మ‌న‌సొప్ప‌క ఒప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అస‌లు తెలుగు దేశం పార్టీ NDAతో క‌లవ‌డం ఆ పార్టీ శ్రేణుల‌కు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఏమీ అన‌లేని ప‌రిస్థితి. కొంద‌రు నిరుత్సాహంతో పార్టీకి రాజీనామా చేసి YSRCPలోకి కూడా వెళ్లారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటే దానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. కాదు కూడ‌దు అన‌డానికి లేదు. పైగా తెలుగు దేశం పార్టీకి కంచుకోట‌లుగా ఉంటున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ అడ‌గ‌డం ప‌ట్ల పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. (TDP BJP Janasena)