BJP: కాంగ్రెస్ కర్ణాటకను మినీ పాకిస్థాన్ చేసేస్తోంది
Bengaluru: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ (congress).. కర్ణాటక రాష్ట్రాన్ని మినీ పాకిస్థాన్‌గా మార్చేస్తోందని ఆరోపించింది BJP. కేంద్రం ప్రవేశపెట్టిన యాంటీ కన్వర్షన్ చట్టాన్ని (anti conversion law) కాంగ్రెస్ కొట్టిపారేయనుంది. దీని ద్వారా ఏ మతం వారు కూడా ఇతరులను తమ మతంలోకి బలవంతంగా మార్చలేరు. కొన్ని రూల్స్ పాటిస్తేనే వేరే మతంలోకి మారే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఈ చట్టాన్ని కొట్టేస్తే విచ్చలవిడిగా బలవంతపు మత మార్పిడిలు ఉంటాయని BJP ఆరోపిస్తోంది. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ కర్ణాటకను మినీ పాకిస్థాన్‌గా మార్చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంతదాకైనా వెళ్తుందని ఒక వర్గానికి సంబంధించిన వారి నుంచి సపోర్ట్ రావడం కోసం కాంగ్రెస్ ఈ నీచపు చర్యలకు పాల్పడుతోందని మండిపడింది. రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన APMC చట్టాన్ని కూడా కాంగ్రెస్ తొలగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. APMC చట్టం ద్వారా.. APMC యార్డుల్లోనే కాకుండా రైతులు తాము పండించినది దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలుండేలా కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు దానిపై కాంగ్రెస్ కన్నుపడిందని BJP ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.