Lok Sabha Election: అర్థరాత్రి 5 గంటల పాటు మీటింగ్
Delhi: లోక్‌సభ ఎన్నికలు (lok sabha election) రాబోతున్న సందర్భంగా BJP హైకమాండ్ నిన్న అర్థరాత్రి సడెన్ మీటింగ్ ఏర్పాటుచేసింది. దాదాపు ఐదు గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi).. కేంద్ర మంత్రులు అమిత్ షా (amit shah), జేపీ నడ్డాలతో (jp nadda) మాట్లాడారు. మీటింగ్‌లో కేబినెట్ మార్పుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన BJP నేతల్లో అసమ్మతి నెలకొన్న విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మొదటి నుంచి BJP మేనిఫెస్టోలో ఉన్న యూనిఫాం సివిల్ కోడ్‌ను (uniform civil code) ప్రవేశపెట్టి తీరాల్సిందేనని మోదీ అల్టిమేటం విధించారట. కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోయిన BJP ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనైనా (lok sabha election) పవర్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మధ్యప్రదేశ్ (madhya pradesh), రాజస్థాన్ (rajasthan), తెలంగాణ (telangana), ఛత్తీస్‌గఢ్‌లలో (chattisgarh ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో BJP పవర్లో ఉన్నది మధ్యప్రదేశ్ మాత్రమే. ఇక మిగతా మూడు రాష్ట్రాల్లోనూ తమ సత్తా చాటాలని BJP ప్లాన్లు వేస్తోంది.