బండి సంజయ్‌ని తీసేసాక ఇక నాకేం పని?
Nalgonda: బండి సంజయ్‌ను (bandi sanjay) BJP తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తీసేయడం చాలా మందికి నచ్చలేదు. సంజయ్‌ను తొలగించడంతో ఈరోజు ఉదయాన్నే ఖమ్మం BJP వైస్ ప్రెసిడెంట్ గజ్జల శ్రీనివాస్ (gajjela srinivas) ఆత్మహత్యాయత్నం చేసారు. ఇప్పుడు BJP నల్లగొండ పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్ రావు తన పదవికి రాజీనామా చేసారు. బండి సంజయ్ లేనప్పుడు ఇక నాకేం పని అంటూ కామెంట్స్ చేసారు. బండి సంజయ్ లేకుండా BJP తెలంగాణ ఎన్నికల్లో గెలవలేదని ఆయన ఉన్నందుకే తెలంగాణలో BJPకి పాపులారిటీ వచ్చిందని తెలిపారు. సంజయ్‌ని చూసే కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారని, ఎన్నికల నేపథ్యంలో సంజయ్‌ను తొలగిస్తే BJP ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుందని పేర్కొన్నారు.