BJP: ఆనాడు ఎంపీలను చంపాలని చూసిందే మీరు.!
BJP ఎంపీ నిశికాంత్ డూబే.. కాంగ్రెస్‌పై లోక్ సభలో మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. OBCలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఆమె మాట్లాడుతుండగా.. BJP ఎంపీ నిశికాంత్ డూబే.. 2012లో పార్లమెంట్‌లో చోటుచేసుకున్న వాగ్వాదం గురించి గుర్తు చేసారు. 2012లో నారాయణస్వామి ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషనల్ కోటాలో బిల్లు ప్రవేశపెడుతుంటే.. సమాజ్‌వాది పార్టీకి చెందిన యశ్వీర్ సింగ్ ఆ బిల్లుని లాక్కుని చించిపారేసారని నిశికాంత్ అన్నారు.
ఆ సమయంలో సోనియా గాంధీ.. యశ్వీర్ సింగ్ చొక్కా పట్టుకున్నారని గుర్తుచేసారు. BJP లేకపోతే..కాంగ్రెస్ తమ ఎంపీలను చంపేసేదే అని ఆనాడు సమాజ్‌వాది పార్టీనే ఒప్పుకుందని తెలిపారు. ఆనాడు ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మహిళా రిజర్వేషన్‌లో కూడా స్థానాలు కల్పించాలని సమాజ్‌వాది పార్టీ కోరగా.. ఇందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఇప్పుడు సోనియా గాంధీ ఓబీసీలకు కూడా సీట్లు కల్పించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని నిశికాంత్ అన్నారు.