సారీ చెప్పేయ్ సల్మాన్.. నెక్స్ట్ ఏసేది నిన్నే
Harnath Singh: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు వారే స్వయంగా వెల్లడించారు. సిద్ధిఖీకి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడు. వీరిద్దరికీ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని చంపేసినట్లు కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మరోపక్క 30 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్ బ్లాక్ బక్‌ను చంపి బిష్ణోయ్ వర్గాన్ని అవమానించారన్న కోపంతో చంపేసారని మరికొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. బాబా సిద్ధిఖీకి సల్మాన్ అత్యంత సన్నిహితుడు కావడంతో సల్మాన్‌తో క్లోజ్‌గా ఎవరైతే ఉంటారో వారందరినీ లేపేస్తాం అని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఆల్రెడీ సల్మాన్ ఖాన్‌పై రెండు మూడు సార్లు హత్యాయత్నాలు జరిగాయి. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు టైట్ సెక్యూరిటీ కేటాయించింది. బాబా సిద్ధిఖీ హత్యతో ఆ సెక్యూరిటీని మరింత బలపరిచింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ హరినాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దీనిని ఇక్కడితో వదలదని.. నెక్స్ట్ వేసేది సల్మాన్ ఖాన్నే అని ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. అంతవరకు తెచ్చుకోకుండా సల్మాన్ తాను చేసిన తప్పుని ఒప్పుకుని బిష్ణోయ్ కమ్యూనిటీకి సారీ చెప్తే వదిలేస్తారని ఆయన అనడం సంచలనంగా మారింది.
“” సల్మాన్ బేటా.. బ్లాక్ బక్ అనే జింకను బిష్ణోయ్ వర్గం దైవంతో సమానంగా చూస్తుంది. అలాంటి బ్లాక్ బక్‌ను నువ్వు వేటాడి చంపావ్. ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? ఈ పాపానికి గానూ జోధ్‌పూర్ కోర్టు నీకు ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తే రెండు రోజులు జైల్లో ఉండి వెంటనే బెయిల్‌పై బయటికి వచ్చేసావ్. అప్పటి నుంచి ఇప్పటివరకు నువ్వు బెయిల్‌పైనే ఉన్నావ్. పైగా బిష్ణోయ్ వర్గానికి నువ్వు సారీ కూడా చెప్పలేదు. ఇప్పుడు నీకు సన్నిహితంగా ఉన్నవారిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపేస్తోంది. తర్వాత ఏసేది నిన్నే. నా మాట విని చేసిన తప్పుని ఒప్పుకుని క్షమించమని అడుగు. వాళ్లు వదిలేస్తారు. క్షమించమని అడిగితే నీ స్థాయి దిగజారిపోదు. పైగా మరింత హుందాతనాన్ని ఇస్తుంది. నా మాట విను. సారీ చెప్పేయ్ “” అని హరినాథ్ సింగ్ వెల్లడించారు.