Arvind Dharmapuri: సొంత పార్టీ నుంచే వ్యతిరేకత
Nizamabad: నిజామాబాద్ BJP ఎంపీ అరవింద్ ధర్మపురికి (arvind dharmapuri) సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా కార్యకర్తలు BJP కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్మూర్, బోధన్, బాల్కొండకు చెందిన నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా BJP కార్యాలయాన్ని ముట్టడించారు. 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై ఈ నిరసన జరుగుతోంది.