BJP ఎమ్మెల్యేపై చేత‌బ‌డి..!

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన BJP ఎమ్మెల్యే లోకేంద్ర ప్ర‌తాప్ సింగ్ (lokendra pratap singh) త‌న‌పై ఎవ‌రో చేత‌బ‌డి చేసారని ఆరోపిస్తున్నారు. త‌న ఇంటి ముందు త‌న ఫోటోతో పాటు ప‌సుపు కుంకుమ నూనె నిమ్మ‌కాయ‌ను పెట్టి వెళ్లిపోయారంటూ ఆ ఫోటోను షేర్ చేసారు. 2023లో చంద్రుడిపై కాలు పెడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ చేత‌బ‌డులు, క్షుద్ర‌పూజ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని అయినా తాను ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని అన్నారు. తాను శివ భ‌క్తుడిన‌ని ఇలాంటి పూజ‌లు త‌న‌పై ఫ‌లించ‌వ‌ని హెచ్చ‌రించారు.