“దుస్తులు విప్పేసుంటే 100 గ్రాములు తగ్గేదానివి కదా..”
Vinesh Phogat: ఒలింపిక్స్ రెజ్లింగ్ రౌండ్‌లో ఫైనల్స్ నుంచి డిస్మిస్ అయిన భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌పై భారతీయ జనతా పార్టీ నేత విశాల్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసాడు. రెజ్లింగ్‌లో సెమీ ఫైనల్ వరకు వెళ్లిన వినేష్ ఈసారి బంగారు పతకాన్ని సాధిస్తుందని యావత్ భారతదేశం ఆశించింది. కానీ ఫైనల్స్‌కి గంట మందు వినేష్ 100 గ్రాములు అధిక బరువు ఉందని ఆమెపై అనర్హత వేటు పడింది.
దీనిపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే విశాల్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. “” గతంలో భారతీయ జనతా పార్టీ నేత బ్రిజ్ భూషన్ షరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసావు కదా.. అలాంటప్పుడు ఆ దుస్తులు విప్పేసి ఉంటే 100 గ్రాముల బరువు తగ్గి ఉండేదానివి “” అని ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టాడు. దాంతో పెద్ద ఎత్తున ఆందోళన చోటుచేసుకుంది. అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.