Udupi Incident: సీఎం కోడలికో కూతురికో జరిగి ఉంటే…?
Bengaluru: ఓ BJP మహిళా కార్యకర్త చేసిన ట్వీట్ వల్ల ఆమె జైలు పాలైంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (siddaramaiah) గురించి అసభ్యకర ట్వీట్ వేయడంతో ఆమెపై కేసు నమోదై అరెస్ట్ అయింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. కర్ణాటకలోని ఉడుపి (udupi incident) ప్రాంతంలో ఇటీవల ఓ ప్రైవేట్ కాలేజీలోని బాత్రూమ్లో అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుండగా సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (udupi incident)
బాత్రూమ్లో ఓ మొబైల్ ఫోన్ దొరకడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు. అయితే ఆ ఫోన్లో ఎలాంటి అసభ్యకరమైన కంటెంట్ కానీ వీడియో కానీ దొరకకపోవడంతో కేసు కొట్టివేసారు. కాకపోతే ఆ ముగ్గురు వ్యక్తులను సస్పెండ్ చేసారు. అయితే వీడియోలు దొరకనంత మాత్రాన కేసు ఎలా కొట్టేస్తారంటూ స్థానిక BJP కార్యకర్తలు ధర్నా చేపట్టారు. దీనిపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర స్పందిస్తూ.. “” ఇది చిన్న విషయం. ఎందుకు పెద్దది చేయడం. ఏదో కాలేజ్ ఫ్రెండ్స్ వారిలో వారు ఇలా కొట్టుకున్నారు. దానిని వదిలేయడం మంచిదా? రాజకీయ రంగు పూసి రచ్చ చేయడం మంచిదా? “” అని అన్నారు. దీనిపై శకుంతల ట్వీట్ చేస్తూ..“” ఇదే ఘటన సిద్ధారామయ్య కూతురికో కోడలిలో జరిగి ఉంటే ఇలాగే అనేవారా? “” అని ట్వీట్ వేసారు. దాంతో ఆమెను అరెస్ట్ చేసారు.