BRS పార్టీలోకి BJP నేత..!

BJP రామగుండం నేత కౌశిక్ హరి (kaushik hari) BRS పార్టీలో చేరనున్నారు. రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ BJP నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే BRS పార్టీలో చేరనున్నారు. 2009లో ప్రజా రాజ్యం నుంచి పోటీ చేయగా కేవలం 1200 ఓట్ల తేడాతో ఆయ‌న‌ ఓడిపోయారు. శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు KTR, హరీష్ రావులతో భేటీ అయిన కౌశిక్ హరి పార్టీలో చేరేందుకు అంగీక‌రించారు. త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరితో సహా పలువురు BJP సీనియర్ నాయకులు BRS పార్టీలోకి చేరనున్నారు.