Bhaskar Goud: ఫేమస్ అవ్వాలని ఫేక్ మర్డర్ అటెంప్ట్ చేయించుకుని
Bhaskar Goud: అతడు సినిమా స్టైల్‌లో తన మీద తానే హత్యా ప్రయత్నం చేయించుకుని ఫేమస్ అవ్వాలనుకున్నాడు BJP నేత భాస్కర్ గౌడ్. పైగా తనపై హత్యా ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని ఉప్పల్ పోలీసులు విచారణ చేపట్టగా భాస్కర్ గౌడే నిందితుడని విచారణలో తేలడంతో అతనితో పాటు ఇంకో ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు.
ఈ భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను సినీ నిర్మాతగాను, బిజెపి హిందూ ప్రచార కమిటీ వ్యవహారకర్త గాను వ్యవహరిస్తున్నారని డిసిపి పద్మజ తెలిపారు. సమాజంలో పలుకుబడి పెంచుకోవడం ఈ మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు. తనకు గన్‌మెన్లు వెంట ఉంటే సమాజం గౌరవిస్తుందన్న దురుద్దేశంతో ఈ మర్డర్ ప్లాన్ చేశాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఉప్పల్ భగాయత్‌లో ఈ మర్డర్ అటెంప్ట్ ప్లాన్ జరిగింది. ఈ మర్డర్ అటెంప్ట్ ప్లాన్ కోసం 2,50,000 ఒప్పందం కుదుర్చుకున్నాడు. భాస్కర్ గౌడ్‌పై ఆల్రెడీ జంట నగరాల్లోని పోలీస్ స్టేషన్‌లో ఏడు కేసులు నమోదు అయ్యి ఉన్నాయి. వీరి నుంచి పోలీసులు ఇన్నోవా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.