ద్వేషపూరిత వ్యాఖ్యలు BJP నుంచే ఎక్కువ..!
దేశవ్యాప్తంగా ముస్లింల పట్ల ద్వేషపూరిత (hate speech) వ్యాఖ్యలకు పాల్పడింది BJP మాత్రమేనట. ఈ విషయాన్ని వాషింగ్టన్ డీసీకి చెందిన నివేదికలో వెల్లడైంది. ఇప్పటివరకు నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుని రీసెర్చ్ చేస్తే.. వాటిలో 80% ద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రసంగాలు చేసింది RSS, BJP మాత్రమేనని తేలింది. 2014లో కేంద్రంలో మోదీ (narendra modi) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే యాంటీ ముస్లిం వివాదాలు, ద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువయ్యాయట. దీనిపై ఢిల్లీకి చెందిన BJP నేత అభయ్ వర్మ స్పందిస్తూ.. ఆ నివేదికను ఎవ్వరూ నమ్మవద్దని అదంతా అబద్ధమేనని తెలిపారు. ద్వేష, మత పూరిత రాజకీయాకీలకు BJP పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు.
2017లో క్రైం బ్యూరో ద్వేషపూరిత కుట్రలపై నివేదిక కోసం డేటా సేకరించడం ఆపేసింది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ డీసీకి చెందిన హిందుత్వా సంస్థ సోషల్ మీడియా ద్వారా డేటాను సేకరించగా.. 80% ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలకు పాల్పడింది భారతీయ జనతా పార్టీతో పాటు ఈ పార్టీకి చెందిన RSS, విశ్వ హిందు పరిషత్, సకల్ హిందూ సమాజేనని తేలింది. ఇక ద్వేషపూరిత వ్యాఖ్యలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్‌లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంది.