BJP: పొత్తు కానుక.. ఎన్టీఆర్‌కు భారత రత్న?
BJP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలైన తెలుగు దేశం పార్టీ, జనసేనతో పొత్తును ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీ ఎన్నికలను పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ కన్ను లోక్ సభ ఎన్నికలపై ఉంది. అందుకే సీట్ షేరింగ్‌లో భాగంగా ఎంపీ స్థానాలు ఎక్కువగా కావాలని అడిగింది. దాంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త తగ్గి తన సీటును త్యాగం చేసారు.
అయితే ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఎటూ తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి.. తెలుగు ప్రజల అభిమానాన్ని గెలుచుకునేందుకు.. వారి ఓట్ల రాబట్టుకునేందుకు పెద్దాయన ప్రధాని నరేంద్ర మోదీ ఓ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న ప్రకటించాలని. 2025లో నందమూరి తారక రామారావుకు భారత రత్నను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారట. ఇదే విషయం గురించి పార్టీ హైకమాండ్‌తోనూ చర్చిస్తున్నారు. ఈ టాపిక్‌ను అడ్డం పెట్టుకుని ప్రజల ఓట్లు దక్కించుకోవాలని పథకం రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: TDP BJP Janasena: అసలైన అందరివాడు..!