Nitish Kumar: BJPకి వ‌ణుకు మొద‌లైంది.. ముంద‌స్తుకు వెళ్తారేమో!

త‌మ అపోజిష‌న్ కూట‌మిని (india bloc) చూసి BJPకి వ‌ణుకు పుట్టింద‌ని అన్నారు బిహార్ సీఎం నితీష్ కుమార్ (nitish kumar). BJP ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నుకుంటోందని త‌న‌కు ముందు నుంచే అనుమానం ఉంద‌ని.. ఇటీవ‌ల పార్ల‌మెంట్ ప్రత్యేక స‌మావేశాల‌ను ప్ర‌క‌టించాక త‌న అనుమానం నిజ‌మైంద‌ని తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక‌ల  (one nation one election) విధానం గురించి మాట్లాడుతూ.. ఈ త‌ర‌హాలో ఎన్నిక‌లు గ‌తంలో కూడా జ‌రిగాయ‌ని, దీని గురించి కూడా త‌మ స‌మావేశంలో చ‌ర్చించామ‌ని తెలిపారు. త‌మ ఇండియా కూట‌మిని చూసి BJPకి ఆల్రెడీ వ‌ణుకు పుట్టింద‌ని అందుకే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు (early elections) వెళ్లాల‌నుకుంటున్నాయ‌ని అన్నారు. (nitish kumar)