Kangana Ranaut: ఎగిరిపడింది.. పార్టీ షాకిచ్చింది
Kangana Ranaut: అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే సొంత పార్టీ కూడా చూస్తూ ఊరుకోదని నిరూపించింది భారతీయ జనతా పార్టీ. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ముందు నుంచీ ప్రధాని నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీ పాలసీలకు పెద్ద ఫ్యాన్. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కంగనకు మండి నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. కంగన మండిలో పోటీ చేయడమే కాదు గెలిచింది కూడా.
ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే పార్టీ పక్కనపెట్టేస్తుంది. ఇప్పుడు కంగనకు ఇదే ఎదురైంది. ఆల్రెడీ పంజాబ్ రైతులు ఉగ్రవాదులతో సమానులనంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేయడం వల్లే ఓ రైతు బిడ్డ అయిన సీఆర్పీఎఫ్ మహిళా పోలీస్ కంగన చెంప ఛెళ్లుమనిపించింది. ఇంత జరిగినా కంగన ఇంకా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుండడంతో హై కమాండ్ కంగనపై చర్యలు తీసుకుంది. ఆమె పార్టీ సిద్ధాంతాలకు సంబంధించిన ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని.. కంగన రైతుల గురించి చేసిన వ్యాఖ్యలను పార్టీ ఖండిస్తోందని వివరణ ఇచ్చింది. దాంతో కంగనకు నమ్ముకున్న పార్టీనే మొట్టికాయలు వేయడంతో మౌనంగా ఉండిపోయింది.