Harish Rao: వాళ్ల‌వి స్కామ్స్.. మావి స్కీమ్స్‌..!

Hyderabad:  BJP, కాంగ్రెస్ (congress) పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయ‌ని అన్నారు BRS మంత్రి హ‌రీష్ రావు (harish rao). అయితే కొట్లాట‌లు లేదా అవినీతి త‌ప్ప ఏమీ లేవని అన్నారు. తెలంగాణ‌లో ర‌క‌ర‌కాల స్కీమ్‌ల‌తో ప్ర‌జ‌ల‌కు ఏం అవ‌స‌రం ఉన్నా వెంట‌నే వాటిని సీఎం KCR తీరుస్తున్నార‌ని అన్నారు. ఈ స్కీమ్స్ ఏవీ కూడా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చెప్పిన‌వి కాద‌ని, ప్ర‌జ‌లు అడిగార‌ని వీటిని తీసుకురాలేద‌ని ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో KCR ఆలోచించి కుటుంబ పెద్దగా ప్ర‌జ‌ల‌కు ఇవన్నీ అంద‌జేసార‌ని తెలిపారు.