BJP Big Plan: నేడు సెంట్ర‌ల్ ఎన్నిక‌ల క‌మిటీతో భేటీ

రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) మళ్లీ ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌ని అనుకుంటోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ (bjp big plan). నిన్న పంద్రాగ‌స్ట్ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) వ‌చ్చే ఏడాది ఇదే ఎర్ర కోట‌పై క‌లుద్దాం అంటూ మోదీ చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అలా ఎలా ముందే గెలుపును నిర్ణ‌యించేస్తారు అని ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ (congress) విమ‌ర్శించినా..మా ప్లాన్లు మాకున్నాయ్ అంటూ ధీమా వ్య‌క్తం చేస్తోంది BJP. ఈ నేప‌థ్యంలో ఈరోజు సాయంత్రం మోదీతో పాటు BJPలోని కీల‌క నేత‌లు సెంట్ర‌ల్ ఎన్నిక‌ల క‌మిటీతో (central election committee) భేటీ కానున్నాయి. మీటింగ్‌కు మోదీ, కేంద్ర‌మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డాల‌తో పాటు ఇత‌ర కేంద్ర ఎన్నిక‌ల ప్యానెల్‌లోని స‌భ్యులు హాజ‌రుకానున్నారు.

పోల్ స్ట్రాటెజీలు, అభ్య‌ర్ధుల‌ను ఫైన‌లైజ్ చేయ‌డంలో BJPకి సెంట్ర‌ల్ ఎలెక్ష‌న్ క‌మిటీ టాప్ రోల్ పోషిస్తుంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇలా క‌మిటీతో భేటీ అవ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. అలాంటిది ఇప్పుడు మీటింగ్ పెట్టిందంటే..BJP పెద్ద ప్లాన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోవ‌డంతో ఈసారి BJP ఎలాంటి రిస్క్‌లు తీసుకోవాల‌ని అనుకోవడంలేదు. 2024లో మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌, మిజోరాం, రాజ‌స్థాన్, మ‌ధ్యప్ర‌దేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌. ప్ర‌స్తుతానికి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే BJP అధికారంలో ఉంది. తెలంగాణ‌లో BRS, రాజ‌స్థాన్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కాంగ్రెస్ (congress) అధికారంలో ఉన్నాయి. (bjp big plan)

ఇక మిజోరాంలో MNF అధికారంలో ఉంది. ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో అపోజిష‌న్ కూట‌మి ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంలో (no confidence motion) BJPకి వ్య‌తిరేకంగా నిలిచింది MNF. మ‌ణిపూర్‌లో BJP వ్య‌వ‌హ‌రించిన తీరుతో తాము BJPకి వ్య‌తిరేకంగా ఉంటామ‌ని వెల్ల‌డించింది. 2024లో జ‌న‌ర‌ల్ ఎన్నిక‌లు కూడా ఉన్నాయి కాబ‌ట్టి NDA ఇండియాకు (i-n-d-i-a)మ‌ధ్య పోటీ చాలా క‌ఠినంగా ఉండ‌బోతోంది.

ఈరోజు సాయంత్రం మీటింగ్‌లో ఈ ఐదు రాష్ట్రాల్లో BJP ఎక్క‌డెక్క‌డ వీక్‌గా ఉందో ఆ సీట్ల‌పైనే ఫోక‌స్ పెట్టాల‌ని అనుకుంటున్నాయి. ముందే వీక్‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌బోయే అభ్య‌ర్ధుల‌ను ఎంపిక‌చేసి పెట్టుకుంటే ప్ర‌చారం స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పొంద‌డానికి మ‌రింత స‌మ‌యం ఉంటుంద‌ని BJP భావిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌స్య‌ల లిస్ట్‌ను త‌యారుచేసి ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇచ్చిన హామీలకు వ్య‌తిరేకంగా కొత్త హామీలు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. (bjp big plan)