TDP BJP Janasena: అన్ని సీట్లంటే కుదరదు అంటున్న బాబు!
TDP BJP Janasena Alliance: భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీ, జనసేనల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటుపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పిలుపు కోసం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party), జనసేన (Janasena) పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పడిగాపులు కాస్తున్నారు. భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) 8 ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు అడుగుతుండగా.. 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఇస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు, పవన్ పొత్తులపై చర్చలు జరిపారు. ఇక ఫైనల్ క్లారిటీ కోసం అమిత్ షా నుంచి పిలుపు వస్తుందని వీరిద్దరూ ఎదురుచూస్తున్నారు. (TDP BJP Janasena)
ఎటూ అసెంబ్లీ స్థానాలు అడిగినంత ఇవ్వడంలేదని కనీసం ఎంపీ స్థానాలనైనా 8 వరకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. భారతీయ జనతా పార్టీ తెలుగు దేశం, జనసేన పార్టీలతో చేతులు కలిపినా.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మెజారిటీతో గెలిచేది మాత్రం తెలుగు దేశం పార్టీనే అని చెప్పాలి. ఈ మూడు పార్టీల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా ఎన్ని ఓట్లు పడినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడే. ఈ విషయాన్ని ఆల్రెడీ నారా లోకేష్ (Nara Lokesh) కూడా కన్ఫామ్ చేసేసాడు. పవన్ కళ్యాణ్ కూడా పవర్ షేరింగ్ ఆశించకుండా ఎలాగంటే అలా ముందైతే గెలుద్దాం అనే భావనలో ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేసినా.. పొత్తు పెట్టుకుని పోటీ చేసినా పెద్దగా లాభం ఏమీ ఉండదు. అందుకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ హై కమాండ్ అంత ఫోకస్ చేయడంలేదు. ఈ పార్టీ ఫోకస్ అంతా పార్లమెంట్ ఎన్నికలపైనే ఉంది. మూడోసారి అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలు చేయని ప్రయత్నం లేదు. ఎటూ అసెంబ్లీ స్థానాలు తగ్గిస్తున్నారు కాబట్టి కనీసం అడిగిన 8 ఎంపీ స్థానాలు ఇస్తే అక్కడ పోటీ చేసుకుని గెలిచి పార్లమెంట్లో తమ మెజారిటీని మరింత పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్లాన్ వేసింది.
భారతీయ జనతా పార్టీ అడిగిన సీట్లకు చంద్రబాబు నాయుడు ఒప్పుకుని ఉంటే నిన్న రాత్రి జరిగిన చర్చ తర్వాత వెంటనే అధికారిక ప్రకటన వెలువడేది. కానీ చంద్రబాబు నాన్చారు. దాంతో మరోసారి చర్చించుకుందాం అని అమిత్ షా, జేపీ నడ్డాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ను ఢిల్లీలోనే ఎదురుచూసేలా చేసారు. ఈరోజు రాత్రికి ఏ విషయం అనేది కన్ఫామ్ అయిపోతుంది.