Pawan Kalyan: జగన్‌పై దాడి.. జనసేనానిపై BJP ఆగ్రహం?
Pawan Kalyan: కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీ.. (BJP) జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు కారణం విజయవాడలో జగన్ మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) జరిగిన రాళ్ల దాడే. అసలు ఏం జరిగిందంటే..
జగన్‌పై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ట్వీట్ చేసారు. జగన్ వెంటనే కోలుకోవాలని.. రాజకీయాల్లో హింస అనేది ఉండకూడదని ఆయన ట్వీట్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు. ట్వీట్ చేయకపోగా.. ఆదివారం వారాహి యాత్రలో భాగంగా జగన్‌కు జరిగిన దాడి అంశంపై సెటైర్లు వేసారు.
జగనే తనకు పూల మాల వేస్తున్న సమయంలో రాయితో తలపై కొట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు అన్నట్లు పవన్ అన్నారు. దాంతో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఈ అంశంపై పవన్ పట్ల ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. నరేంద్ర మోదీనే ట్వీట్ చేసినప్పుడు పవన్ ఇలా కామెంట్స్ చేస్తే జగన్‌కే సింపతీ వస్తుంది కానీ తమ కూటమికి ఓట్లు పడే అవకాశం తగ్గుతుందని అంతర్గతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
దీనిపై భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత స్పందిస్తూ.. “” పవన్ అన్ని విషయాలను సినిమా లెన్స్ ద్వారానే చూస్తున్నారు. ఇకనైనా ఆయన హీరోలా డైలాగులు కొట్టడం మాని రాజకీయ నాయకుడిగా ప్రవర్తించాలని సూచిస్తే బాగుండు. పవన్ వ్యాఖ్యల వల్ల ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది “” అని మండిపడ్డారు.
అంతేకాదు.. కూటమి ఏర్పడ్డాక.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు, సభలపై భారతీయ జనతా పార్టీ ఓ కన్నేసి ఉంచిదట. వారు ఎలా మాట్లాడుతున్నారు ఏ అంశాలపై చర్చిస్తున్నారు అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.