karnataka elections: హంగ్ వస్తుందట.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?
bengaluru: కర్నాటక ఎన్నికల(karnataka elections) ఫలితాల కొన్ని సర్వే సంస్థలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. కర్నాటకలో మరోసారి హంగ్(hung) వస్తుందని ఓ సర్వే సంస్థ చెబుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఓటర్ల నుంచి వీరు పలు వివరాలను రాబట్టారు. రెండు సార్లు కూడా కాంగ్రెస్(congress) బీజేపీ(bjp)లో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాదని.. చెబుతున్నాయి. కర్నాటకలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. అందులో మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లను ఏ పార్టీకి వస్తాయో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ రానున్న ఎన్నికల్లో అలా జరిగే అవకాశాలు లేవని పీపుల్స్ పల్స్.. సౌత్‌ఫస్ట్(peoples pulse-south first) వెబ్‌సైట్ వారు చెబుతున్నారు.
బీజేపీకి గతంతో పోలిస్తే సీట్లు తగ్గుతున్నాయని సర్వే సంస్థ పేర్కొంది. అయితే.. 2018లో 36.35 శాతం ఓట్లు బీజేపీకి రాగా… ఇప్పుడు కూడా 36 శాతం ఓట్ షేర్ వస్తుందని.. దీనికి కారణం బీజేపీ రిజర్వేషన్ల అంశం. హిందుత్వంతో ముందుకు వెళ్లడంతో ఓట్ షేర్‌లో పెద్దగా మార్పులు ఉండవని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో 38.14 శాతం ఓట్లు రాగా.. ప్రస్తుతం 41 శాతం వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన ఓట్ షేర్.. మూడు శాతం ఆ పార్టీకి పెరిగినా సీట్లు పొందడంలో మాత్రం అది ఉపయోగపడదని విశ్లేషకులు అంటున్నారు. జేడీఎస్(jds)కు గతంలో 18 శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు 16 శాతానికి పడిపోయింది. ఇది కాంగ్రెస్‌కు యాడ్ కానుంది. ఇక కాంగ్రెస్ 98 సీట్లు కైవసం చేసుకుంటుందని.. బీజేపీకి 92 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంటోంది. జేడీఎస్‌కు 27 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ హంగ్ వస్తే కనుక మరోసారి బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారం దక్కించుకుంటుందని పలువురు చెబుతున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుంటే తప్ప… అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు.