Lok Sabha Election: శత్రువులు మిత్రులై.. ప్రతిపక్షాలు ఏకమై..!
Delhi: లోక్ సభ ఎన్నికలు (lok sabha elections) దగ్గరపడుతున్న సమయంలో జాతీయ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంది. శత్రువులు అనుకున్న పార్టీలు అధికారంలో ఉన్న BJPకి మిత్రులుగా మారుతుంటే..ఇతర పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోయిన BJPకి ఇప్పుడు ఎన్డీఏ కూటమిని మరింత బలంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో NDA ప్రభుత్వంలో ఉండి వెళ్లిపోయిన పార్టీలను మళ్లీ కలుపుకుపోవాలని చూస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో జనతాదళ్ (సెక్యులర్) (JDS), ఆంధ్రప్రదేశ్‌లో TDP, పంజాబ్‌లో అకాళీదళ్ (akalidal) పార్టీలతో పొత్తులు పెట్టకోవాలని BJP ప్లాన్లు వేస్తోంది. మరోపక్క ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని పూర్తిగా దేశం నుంచే తరిమికొట్టాలని ఇతర ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయి. ఇందుకోసం ప్రతిపక్షాలు ఒక్కటై పోరాడాలని అనుకుంటున్నాయి. అందులో కాంగ్రెస్ (congress), TMC పార్టీలు ఉన్నాయి. చూడబోతే ఈసారి లోక్ సభ ఎన్నికలు మరింత రసవత్తరం కానున్నట్లే అనిపిస్తోంది.