TDP Janasena: ఎన్నికల సంఘం గట్టి షాక్.. ఇప్పుడు ఏం జరుగుతుందో?
TDP Janasena: ఇంకో 13 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన, తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు సింబల్‌ను ఫ్రీగా ప్రకటించడంతో జనసేన పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. ప్రచారాలు మొదలైపోయానని.. ఎన్నికలకు ఇంకెంతో సమయం లేనందున గాజు సింబల్‌ను జనసేన గుర్తుగా రిజర్వ్ చేయడం ప్రకటించడం కుదరని పని అని తేల్చి చెప్పింది.
ఇప్పటికే ఈ గాజు గ్లాసు గుర్తును ఇతర ఇండిపెండెంట్ నేతలు కూడా వాడేసుకున్నారు. అంతేకాదు.. కొణిదెల పవన్ కళ్యాణ్ పేరును పోలిన అభ్యర్ధులు చాలా మంది ఉన్నారు. దాంతో ప్రజలు కన్‌ఫ్యూజ్ అయ్యి ఎవరికి ఓటేస్తారో అనే భయం తెలుగు దేశం, జనసేన పార్టీల్లో ఉంది. గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీజ్ చెయ్యకపోతే తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తున్న 62 అసెంబ్లీ సీట్లు, 5 ఎంపీ నియోజకవర్గాలలో ఆ గుర్తుతో ఇండిపెండెంట్లు పోటీలో ఉంటారు.
వెబ్‌సైట్ కోసం https://telugu.newsx.com/ అని టైప్ చేయండి