Bhatti Vikramarka: మన పార్టీలోకి వచ్చేయండి.. భట్టి పిలుపు
Bhatti Vikramarka: పలు కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అలా తిరిగొచ్చిన వారిని మళ్లీ అక్కున చేర్చుకుంటామని.. ఎవరి ప్రలోభాలను గురికావొద్దని అన్నారు. అంతా కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన బాటలో నడుస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న మంచిని ప్రజలకు తెలియజేద్దాం అని పిలుపునిచ్చారు. వైఎస్సార్ 75వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకునే వారు మాత్రమే వైఎస్సార్ అభిమానులు.. అలా కోరుకోని వారు వైఎస్సార్‌కు వ్యతిరేకులు అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.