Telangana Elections: అవ‌స‌ర‌మా.. ఇంకోసారి ఆలోచించండి

Telangana Elections: CPI (M) స్టేట్ సెక్ర‌ట‌రీ తమ్మినేని వీరభద్రంకు (thammineni veerabhadram) కాంగ్రెస్ నేత‌ భట్టి విక్రమార్క (bhatti vikramarka) ఫోన్ చేసారు. ఈరోజు CPI (M) అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేసింది. పోటీపై పునరాలోచన చేయాలని భట్టి ఆయ‌న్ను రిక్వెస్ట్ చేసారు. తమకు ఇస్తామన్న స్థానాలపై ఎలా నిర్ణయం తీసుకున్నారని ఈ సంద‌ర్భంగా తమ్మినేని అడిగారు. జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయ‌ని భ‌ట్టి అన‌డంతో పొత్తుపై క్లారిటీ లేనందుకే అభ్యర్థులను ప్రకటించేసామ‌ని ఇక‌ పొత్తుపై ఇప్పుడు ఆలోచించే అవ‌కాశం లేద‌ని త‌మ్మినేని తేల్చి చెప్పారు.