Telangana Elections: ముందు నుయ్యి వెనక గొయ్యి..!
Telangana Elections: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి KCRకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడూ తన నియోజకవర్గం అయిన గజ్వేల్ (gajwel) నుంచి పోటీ చేసే KCR..ఈసారి కామారెడ్డి (kamareddy) నుంచి కూడా బరిలో దిగనున్నారు. ఇందుకు కారణం ఒకవేళ గజ్వేల్లో ఓడిపోతే కామారెడ్డిలో లేదా కామారెడ్డిలో ఓడిపోతే గజ్వేల్లో గెలిచే ఛాన్సులు ఉంటాయి అన్న ఉద్దేశమే అని తెలుస్తోంది.
అయితే గజ్వేల్లో BJP నుంచి ఈటెల రాజేందర్ (etela rajender) పోటీ చేసే అవకాశం ఉందని KCRకు ముందే తెలిసి సేఫ్ సైడ్ ఉండేందుకు కామారెడ్డిలో పోటీ చేయాలని ఆయన అనుకున్నట్లు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కామారెడ్డిలో తనకు గట్టి పోటీ ఇచ్చేవారు ఎవ్వరూ లేరు కదా అని KCR అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ (congress) నుంచి నేనున్నా అంటూ రేవంత్ రెడ్డి (revanth reddy) బరిలోకి దిగారు. దాంతో ఇప్పుడు KCR పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి తీరుగానే ఉంది.