Benjamin Netanyahu: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు గాజాపై (israel gaza war) చేపడుతున్న దాడులు, కాల్పులను విరమించుకోవాలని ఎంత చెప్పినా వినడంలేదు. జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణపై ముసాయిదాను ప్రవేశపెట్టగా.. మెజారిటీ సభ్య దేశాలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగానే ఓటు వేసాయి. ఆ సభ్య దేశాలలో మన భారత్ కూడా ఉంది.
అంతర్జాతీయ మద్దతు కోల్పోతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇస్తున్నా కూడా బెంజమిన్ వెనక్కి తగ్గడంలేదు. అంతర్జాతీయ దేశాల మద్దతు ఉన్నా లేకపోయినా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని మీడియా ద్వారా వెల్లడించారు. గాజాపై కాల్పులను దాడులను ఆపే ప్రసక్తే లేదని చెప్పారు.