Bandla Krishnamohan Reddy: తూచ్ నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను

Bandla Krishnamohan Reddy wants to stay in congress only

Bandla Krishnamohan Reddy: గ‌ద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహ‌న్ రెడ్డి కొన్ని నెలల క్రితం కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. ఆ త‌ర్వాత ఓ స‌మావేశంలో BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప‌క్క‌న కూర్చుని న‌వ్వుతూ క‌నిపించ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ బీఆర్ఎస్‌లోకి వ‌చ్చార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. తీరా చూస్తే తాను బీఆర్ఎస్‌లోకి వెళ్ల‌డం లేద‌ని కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని కృష్ణ‌మోహ‌న్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిన్న కాంగ్రెస్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కృష్ణ‌మోహ‌న్ రెడ్డిని త‌న నివాసంలో క‌లిసారు. వారు కాసేపు చ‌ర్చించుకున్నారు. ఆ చ‌ర్చ‌లో ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలీదు కానీ.. వెంట‌నే కృష్ణ‌మోహ‌న్ మీడియా ముందుకొచ్చి తాను బీఆర్ఎస్‌లోకి వెళ్ల‌డంలేద‌ని కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌ని వెల్ల‌డించారు.