Bandla Ganesh: తప్పుడు వార్తలు రాయకు.. తర్వాత నీ ఇష్టం!
Bandla Ganesh: తప్పుడు వార్తలు రాయకు మిస్టర్.. తర్వాత నీ ఇష్టం అంటూ ఓ జర్నలిస్ట్‌ని హెచ్చరించారు నిర్మాత బండ్ల గణేష్. ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్న బండ్ల గణేష్ ఈసారి తెలంగాణలో గెలిచేది కాంగ్రెసే అంటూ సోషల్ మీడియా ద్వారానే కాకుండా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ ప్రచారం చేసారు.
“” సీఎం, ఫైనాన్స్, రెవెన్యూ, ఎక్సైజ్, హోం నాకే కావాలన్న అమ్రాబాద్ టైగర్ అన్న. అన్నీ నీకే ఇస్తే.. మేమంతా ఏం చెయ్యాలే అని ఫోన్ నేలకేసి కొట్టిన మీటింగ్ నుంచి వెళ్లిపోయిన మరో రెడ్డన్న…ఇదంతా నిన్న జరిగిందట. ఇప్పుడే ఓ సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు చెప్పారు “” అని ఓ జర్నలిస్ట్ ట్విటర్‌లో పోస్ట్ చేసారు. ఆ ట్వీట్‌కి బండ్ల గణేష్ బదులు ఇస్తూ.. దయచేసి తప్పుడు వార్తలు రాయకు తర్వాత నీ ఇష్టం మిస్టర్ అంటూ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేసారు.