Bandla Ganesh: రోజా ఒక పులుసు పాప
Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. మంత్రి రోజాపై (Roja), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) షాకింగ్ కామెంట్స్ చేసారు. రోజా ఒక ఐటెం అని ఆమె పులుసు పాప అని అన్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అని కానీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం ఒక పోరాట యోధుడని అన్నారు. (Bandla Ganesh)
మీరు లేనిపోని కేసుల్లో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించి నానా ఇబ్బందులు పెట్టినా చివరికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆరు గ్యారెంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన నీతివంతమైన పరిపాలన, నిజాయతీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు చూస్తూ ఆయన అద్భుతంగా చేస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతోంది.
ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకుండానే నీతివంతమైన పరిపాలన జరుగుతోందని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు. ఇది తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్‌కి తన చుట్టూ ఈగోతో ఏవేవో మాట్లాడుతుంటారు. అలాంటి ఈగో తెచ్చుకోవాలంటే కష్టం. ఒకప్పుడు చరిత్రలో బాలీవుడ్‌లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్‌స్టార్‌గా ఉండేవారు. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నకొద్దీ.. ఆయన పక్కన ఉన్న జనాలు సూపర్‌స్టార్ అనే భ్రమలో పెట్టారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు. షోలేతో సూపర్‌స్టార్ అయిపోయాడు. యావత్ భారతదేశం అమితాబ్ బచ్చన్‌ను సూపర్‌స్టార్ అంటుంటే.. రాజేశ్ ఖన్నా మాత్రం నేనే సూపర్‌స్టార్ అనుకునేవాడు. అలా ఉంది కేటీఆర్ బాగోతం.
ALSO READ: Revanth Reddy: ఏళ్లుగా తిష్టవేసిన అధికారులను బదిలీ చేయాలి
ఒక పదేళ్ల తర్వాత ఏంటబ్బా నా దగ్గరికి జనం రావడంలేదు అనుకుంటుంటే అప్పుడు ఒకాయన వచ్చి సార్ మీరు పదేళ్ల కిందటి వరకే సూపర్‌స్టార్. మీ తర్వాత అమితాబ్ బచ్చన్ అనే ఒకాయన వచ్చి సూపర్‌స్టార్ అయిపోయాడు అని అని చెప్తే అప్పుడు రాజేష్ ఖన్నా షాక్ తిన్నాడు. అలాగే KTR కూడా నేను KCR కొడుకుని.. తెలంగాణ రాష్ట్రం మాది.. తెలంగాణ పేటెంట్ రైట్స్ మాకే ఉన్నాయి అనుకుంటున్నాడు. KTRకి వచ్చిన కష్టం పగొడికి కూడా రాకూడదు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నవారంతా ఛీదరించుకుని వెళ్లిపోతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి స్థానంలో కేవలం హరీష్ రావే మాట్లాడుతున్నాడు. రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ రాజకీయ నాయకుడిగా ఫ్లాప్ అయ్యారు.
ఒక 300 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని వారితో ప్రత్యేకంగా తిట్టించడంలో బాగా సక్సెస్ అయ్యారు. మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా కష్టాలు తెచ్చుకుని మీరు చేసిన పాపాలను కడుక్కోవడానికే మీ జీవితం సరిపోయింది. ఈరోజు మీరు రాజకీయంగా భూస్థాపితం అయిపోయారు. నీలాగా రేవంత్ రెడ్డి వారసత్వంతో రాలేదు. ఓ పోరాట యోధుడిగా నిలిచి గెలిచాడు అని చెలరేగిపోయారు.
రోజా గురించి మాట్లాడుతూ..
ఇటీవల మంత్రి రోజా ఓ సందర్భంగా రేవంత్ రెడ్డిని యాక్సిడెంట్ సీఎం అని కామెంట్ చేసారు. దీనిపై బండ్ల గణేష్ మాట్లాడుతూ.. రోజా ఒక డైమండ్ రాణి. ఆమె గురించి ఏం మాట్లాడతాం. ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు.. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తోందో ఆయన యాక్సిడెంటల్ సీఎం. యాక్సిడెంటల్ సీఎం అంటే తండ్రి చనిపోతే వచ్చే పదవి. నువ్వు పులుసు వండిపెట్టావి కాబట్టి నువ్వు పులుపు పాపవి. రేపో మాపో రోజా మాజీ అవుతుంది. మీ మాజీలంతా కలిసి జబర్దస్త్ ప్రోగ్రామ్‌లు చేసుకోండి. నైట్ పూట మాజీలతో కలిసి కేజీల లెక్కన తెలిసి పులుసు వండిపెట్టుకోండి. అంతేకానీ రేవంత్ రెడ్డిని అనే స్థాయి నీది కాదు. నువ్వు ఐటెం రాణివి. నువ్వు ఐటెంలానే ఉండు అని నోరుపారేసుకున్నారు.