Bandla Ganesh: క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు కాపు కాయాలి

bandla ganesh says will support tdp during its low phase

Bandla Ganesh: క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు కాపు కాయాల‌ని అంటున్నారు ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్‌. తెలుగు దేశం పార్టీ యాక్టివిస్ట్ స్వాతి రెడ్డి చేసిన ట్వీట్‌కు ఆయ‌న రిప్లై ఇస్తూ ఇలా అన్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి బండ్ల గ‌ణేష్ చాలా గొప్ప‌గా మాట్లాడారు. దాని గురించి స్వాతి రెడ్డి ప్ర‌స్తావిస్తూ.. “” బండ్ల గణేష్ అన్న తెలుగు దేశం కార్యకర్తలు అందరు నీకు రుణపడి ఉంటారు. మేము కష్టం లో ఉన్న ప్రతి సారి గళం విప్పావు. మాలో విప్లవం నూరి పోసావు. ఎంత చక్కగా చెప్పావు అన్న మా బాబు గారు గురించి “” అని ట్వీట్ చేసారు. దీనికి బండ్ల గ‌ణేష్ రిప్లై ఇస్తూ.. “” కష్టాల్లో ఉన్నప్పుడు కాపు కాయాలి అధికారం ఉన్నప్పుడు దూరం ఉండాలి “” అని బ‌దులిచ్చారు.