Bandla Ganesh: ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పథకమే.. !

Hyderabad: ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ (congress) ప్రారంభించిన ప‌థ‌కం అని అన్నారు నిర్మాత బండ్ల గ‌ణేష్‌ (bandla ganesh). ఆయ‌న ఎప్పుడూ కాంగ్రెస్‌కే స‌పోర్ట్ చేస్తున్నారు. ఎవ‌రైనా కాంగ్రెస్ (congress) నేత‌లు చేసిన కామెంట్స్‌ను మార్చి రాసినా, కాంగ్రెస్ పార్టీని ఏమైనా అన్నా ట్విట‌ర్‌లో యాక్టివ్‌గా ఉండే ఆయ‌న వెంట‌నే అక్క‌డిక‌క్క‌డే స‌మాధానం చెప్పేస్తున్నారు. అమెరికాలో జ‌రిగిన తానా (tana) స‌భ‌లో  TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) చేసిన వ్యాఖ్య‌ల‌ను BRS త‌ప్పుగా ప్ర‌చురిస్తోంద‌ని బండ్ల గ‌ణేష్ అన్నారు.

ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పథకమే. ఉచిత విద్యుత్‌కు పేటెంట్ హక్కు కాంగ్రెస్‌కు ఉంది. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ గురించి మాట్లాడిన మాటలను టిఆర్ఎస్ వక్రీకరించింది. తెలంగాణలో 8 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుంది అన్నారు. కానీ మేము 24 గంటలకు ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతాం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ప్రారంభించిన విషయం టిఆర్ఎస్ నాయకులు గుర్తించాలి. వైస్సార్ ఉచిత విద్యుత్ కోసం పోరాటం చేస్తుంటే కేసీఆర్ చంద్రబాబు పక్కన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ప‌థ‌కానికి కట్టుబడి ఉంది. మేము రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు పని చేస్తాం. రేవంత్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మాత్ర‌మే మాట్లాడారు అని ట్వీట్ చేసారు బండ్ల గ‌ణేష్‌.