BJP తెలంగాణ ప్రెసిడెంట్ రేసులో డీకే అరుణ‌?!

Hyderabad: BJP తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌దవి రేసులో డీకే అరుణ (dk aruna) ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొంత‌కాలంగా BJPలో ఉన్న తెలంగాణ నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త విభేదాలు త‌లెత్త‌డంతో హై క‌మాండ్ ప్రెసిడెంట్‌ను మార్చాల‌న్న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (bandi sanjay) ఉన్నారు. అయితే ఆయ‌న‌కు.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌తో పాటు మరికొంద‌రు నేత‌ల‌కు విభేదాలు రావ‌డం, దాంతో ఆయ‌న్ను ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని హైక‌మాండ్‌ను ఒత్తిడి చేయడంతో ఆ స్థానాన్ని డీకే అరుణ‌కు ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రోప‌క్క ఈటెల రాజేంద‌ర్‌ను (etela rajender) చేరికల కమిటీ నుండి ప్రచార కమిటీ చైర్మన్‌గా ప్రమోషన్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బండి సంజ‌య్ ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.