Bandi Sanjay: జ‌గ‌న్‌తో కుమ్మక్కయ్యావు KCR.. మాజీ సీఎంవి కాబోతున్నావ్

Bandi Sanjay: డిసెంబర్ 3వ తారీఖు నాడు మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నావ్ KCR గుర్తుపెట్టుకో అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు బండి సంజ‌య్. ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం సంజ‌య్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ వెళ్లి రోజక్క పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని ఆనాడు KCR అన్నార‌ని.. ఆ త‌ర్వాత‌ ఏపీ సీఎంతో కుమ్మక్కయ్యాడ‌ని ఆరోపించారు. ఇవ‌న్నీ అర్థంచేసుకోలేక‌పోవ‌డానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదని డిసెంబ‌ర్ 3న తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయ‌బోతున్నామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు.