Bandi Sanjay: రాష్ట్ర అధ్యక్ష పదవి ఏమన్నా గవర్నర్ పదవా?
Bandi Sanjay: ఎన్నికలు వచ్చేసరికి ఓడిపోతామన్న భయంతో కరీంనగర్ BRS అభ్యర్ధి గంగుల కమలాకర్ (gangula kamalakar) తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు BJP ఎంపీ బండి సంజయ్. ఈసారి సంజయ్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. అవినీతికి పాల్పడ్డాను కాబట్టే BJP తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని కమలాకర్ ఆరోపిస్తున్నారని అదేమన్నా గవర్నర్ పోస్టా లేక మంత్రి పోస్టా తప్పించడానికి అని సెటైర్లు వేసారు.
ఏ ఒక్క కాంట్రాక్టర్ని పిలిచి తాను అవినీతికి పాల్పడినట్లు చెప్పించినా నిరూపించినా తన ఆస్తులన్నీ ప్రజల పేరిట మీద రాసేస్తానని సంజయ్ అన్నారు. తాను ఆల్రెడీ ఎంపీ పదవిలో ఉన్నానని.. హాయిగా అదే పదవిలో కొనసాగుతూ డబ్బులు సంపాదించుకోక మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయాల్సిన అవసరం తనకు లేదని.. కేవలం పేద ప్రజల కోసమే తాను ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటున్నానని తెలిపారు. తనను గెలిపించేందుకు కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని ఇంకో ఐదు రోజులు కష్టపడితే తాను ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడతానని చెప్పారు.