Bandi Sanjay అలక.. కేబినెట్ ఎంట్రీకి నో
Hyderabad: BJP తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (bandi sanjay) అలిగినట్లు తెలుస్తోంది. ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తామని BJP హైకమాండ్ తెలిపింది. అయితే ఇందుకు బండి సంజయ్ (bandi sanjay) ఒప్పుకోలేదట. తనకు తెలంగాణ అధ్యక్ష పదవే కావాలని అది లేకపోతే కార్యకర్తగానైనా ఉంటాను కానీ కేబినెట్‌లోకి రానని చెప్పారట. నిన్న BJP దేశవ్యాప్తంగా కేబినెట్‌లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.