Bandi Sanjay: నోరుజారిన BJP ఎంపీ..!

Telangana: తెలంగాణ BJP అధ్యక్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజయ్  (bandi sanjay)నోరు జారారు. వేములవాడ నియోజకవర్గ BJP సీనియర్ కార్యకర్తల సమ్మేళనంలో బండి సంజయ్ మాట్లాడారు. “డిపాజిట్ గల్లంతయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పోటీ చేయడానికి అభ్యర్థులు కరువైన పార్టీ భారతీయ జనతా పార్టీ” అన్నారు. ఇదంతా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ (prakash javadekar) ముందే అనడం గమనార్హం. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు కాస్తా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇలా త‌లాతోకా లేకుండా మాట్లాడుతున్నాడు కాబ‌ట్టే తెలంగాణ BJP అధ్య‌క్షుడిగా తీసేయాల‌ని హైక‌మాండ్ భావిస్తోంద‌ని తెలుస్తోంది.