Bandi Sanjay క‌విత ప‌ల‌క‌రింపులు!

Nizamabad: BJP నేత బండి సంజ‌య్ (bandi sanjay) , BRS ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత (kavitha) ఫ్రెండ్లీగా ప‌ల‌క‌రించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజామాబాద్‌కు (nizamabad) చెందిన BJP నేత బ‌స్వ న‌ర్స‌య్య ఇంట్లో గృహ‌ప్ర‌వేశ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు బండి సంజ‌య్ అతిథిగా వ‌చ్చారు. అనుకోకుండా క‌విత కూడా ఇదే కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ‌డంతో ఇద్ద‌రూ ఎదుర‌య్యారు. అలా ఇద్ద‌రూ ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకోవ‌డం వైర‌ల్‌గా మారింది. దిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌విత ఇరుక్కున్న‌ప్పుడు బండి సంజ‌య్ ఆమెపై చేసిన కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. పైగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య‌లో ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత శ‌తృత్వం ఉంది. అలాంటిది ఇరు ప‌క్షాల నేత‌లు ఇలా ఎదురుప‌డి ప‌ల‌క‌రించుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.