Balka Suman: వరద బాధితులను వదిలేసి రేవంత్ సరిపోదా శనివారం సినిమాకెళ్లాడు
Balka Suman: తెలంగాణలో భారీ వర్షాలకు ప్రజలు అవస్థలు పడుతుంటే.. పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిపోదా శనివారం సినిమాకు వెళ్లాడని అన్నారు భారత రాష్ట్ర సమితి నేత బాల్క సుమన్. శనివారం నుంచి భారీ వర్షాలు పడుతుంటే కనీసం రివ్యూ చేసిన పాపాన పోలేదని విమర్శించారు. అసలు ముఖ్యమంత్రి ఎక్కడికిపోయాడు సమీక్షలు నిర్వహించకుండా అని తాము చూస్తుంటే.. తమకు అందిన సమాచారం ప్రకారం కుటుంబంతో సహా ఆదివారం సరిపోదా శనివారం సినిమాకు వెళ్లాడని అన్నారు.