EXCLUSIVE: ఇక తప్పేలా లేదు.. YSRCPకి గుడ్‌బై
EXCLUSIVE: YSRCP నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డిని (jagan mohan reddy) తాము మాత్రమే చూసుకుంటే సరిపోదని..జగన్ కూడా తమను అంతే గౌరవంగా చూడాలని గతంలో మీడియా ముందుకు వచ్చి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అప్పటినుంచి బాలినేని పార్టీ నేతల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.
ఇక ఒంగోలు సీటును మంత్రి రోజాకు (rk roja) ఇస్తున్నట్లు బాలినేనికి తెలీడంతో ఆయన తన కుమారుడికి ఆ సీటు ఇస్తే నెత్తినపెట్టుకుని చూసుకుంటా అని వ్యాఖ్యానించారు. కానీ అది కుదిరేలా లేదు. దాంతో ఇక ఆయన పార్టీని త్వరలో వీడనున్నట్లు అనుచరులు తెలిపారు. ఇక తప్పేలా లేదని రాజీనామా చేయడమే ఉత్తమం అనిపిస్తోందని అంటున్నారు. నిన్న సీఎంవో నుంచి బాలినేనికి కబురు వచ్చింది. కానీ బాలినేని వెళ్లేసరికే జగన్ బిజీగా ఉన్నారని తెలిసి ద్వారం వద్దే ఆగిపోయి వెనుదిరిగారు.