AP Elections: బాల‌య్య‌ను CM అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టిస్తేనే TDPకి విజ‌యం!

Hyderabad: TDP ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ను (balakrishna) సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టిస్తేనే వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో (ap elections) విజ‌యం త‌థ్యం అని అంటున్నారు ఓ ప్ర‌ముఖ జ్యోతిష్యుడు. నిన్న బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఆయ‌న జాత‌కం ఎలా ఉందో వివ‌రించారు. బాల‌య్య కెరీర్ ఇప్ప‌టివ‌ర‌కు బాగానే ఉంద‌ని ఇక ముందు కూడా బాగుంటుంద‌ని తెలిపారు. అంతేకాదు.. రానున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ (ap cm jagan) ప్ర‌భుత్వాన్ని ఓడించాలంటే.. బాల‌య్య‌ను సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టిస్తేనే విజ‌యం అని తెలిపారు. ఇక జ‌న‌సేనాని పవ‌న్ క‌ళ్యాణ్ (pawan klayan) జాత‌కం గురించి చెప్తూ ఇంకొన్నేళ్ల‌లో ప‌వ‌న్ చేసే సినిమాల్లో క్వాలిటీ లేక‌పోయినా విజ‌యం సాధిస్తాయ‌ని, కానీ రాజ‌కీయ‌ప‌రంగా మాత్రం గ్ర‌హాలు అనుకూలించ‌డం లేద‌ని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. ఇక చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu), లోకేష్‌లు (lokesh) ప‌ర్స‌న‌ల్‌గా ప్రొఫెష‌న‌ల్‌గా రానున్న రోజుల్లో ఎన్నో స‌వాళ్లు ఎదుర్కొంటార‌ని అన్నారు.