Balakrishna: చెల్లెమ్మా.. సంతోషమేనా?
Balakrishna: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో ఎన్నో అపురూప దృశ్యాలు చోటుచేసుకున్నాయి. వాటిలో ఒకటి.. హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ.. తన సోదరి నారా భువనేశ్వరిని ఆప్యాయంగా పలకరించడం. భువనేశ్వరి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకిస్తుండగా.. బాలయ్య వెనక నుంచి వచ్చి భువనేశ్వరిని సర్‌ప్రైజ్ చేసారు. ఏం చెల్లెమ్మా.. సంతోషమేనా అంటూ ఆమెను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి వెళ్లిపోయారు.