Bajrangdal protest: గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

Hyderabad: గాంధీ భ‌వ‌న్(gandhi bhawan) వ‌ద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భ‌జ‌రంగ్ ద‌ళ్(bajrang dal), బీజేపీ(bjp) కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. జైశ్రీరామ్ అంటూ కేక‌లు వేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. దాంతో పోలీసులు వారిని అదుపుచేస్తున్నారు. మ‌రోప‌క్క బీజేపీ నేత‌లు కాంగ్రెస్‌పై(congress) చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ.. కాంగ్రెస్ మ‌హిళా కార్య‌క‌ర్త‌లు కూడా ఆందోళ‌న చేప‌ట్టారు. బీజేపీ వారికే కాదు హ‌నుమంతుడంటే త‌మ‌కూ అపార‌మైన భ‌క్తి ఉంద‌ని, త‌మ‌కి కూడా హ‌నుమాన్ చాలీసా వ‌చ్చంటూ ఎద్దేవాచేసారు.