Badruddin Ajmal: అన్ని నేరాల్లో మా ముస్లింలే నెంబర్ 1
అన్ని నేరాల్లో మా ముస్లింలే నెంబర్ 1లో ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు AIUDF నేత బద్రుద్దిన్ అజ్మల్ (badruddin ajmal). అస్సాంలో 126 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో AIUDF నేతలు 15 మంది ఉన్నారు. గురువారం రాత్రి అస్సాంలో ఏర్పాటుచేసిన ఓ భారీ బహిరంగ సభలో అజ్మల్ మాట్లాడారు. “” అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు ఇలా అన్ని నేరాల్లో మా ముస్లింలే నెంబర్ 1గా ఉన్నారు. జైలుకి వెళ్లేవారిలో కూడా ముస్లింలే ముందుంటారు. నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది చెప్పండి. మనకు చదువు లేకపోవడం వల్ల దాదాపు అన్ని నేరాల్లో మనమే ముందు ఇన్‌వాల్వ్ అవుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం వర్గాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. యువతకు చదువు తప్పనిసరి. లేకపోతే ఇలా నేరాల్లో మనమే ముందు ఇరుక్కుంటాం.
ఆడవారితో ఎలా ప్రవర్తించాలో మనకు చదువే నేర్పుతుంది. ఇస్లాం ప్రకారం మనం బహిరంగ ప్రదేశాల్లో ఆడవారు కనిపిస్తే అస్సలు చూడకూడదు. ఆ సమయంలో మన ఇంట్లో కూడా ఆడవారు ఉంటారు అని గుర్తుచేసుకుంటే తప్పుడు ఆలోచనలు రావు. భారత్ ఇప్పుడు చంద్రుడిని అందుకోగలిగింది. కానీ మన ముస్లిం వర్గం మాత్రం నేరాలు ఎలా చేయాలి? జైలుకి ఎలా వెళ్లాలి అనే అంశాలపై పీహెచ్‌డీ చేసింది. ఇది చాలా తప్పు. మనం చదువుకోవాలి. చదువు చాలా ముఖ్యం. ఇది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. వారు ముస్లింలకు చదువు ముఖ్యం అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాల్సిందే “” అని తెలిపారు.