“ఆ సీఎంకు అసలు పవర్ లేదు.. అందుకే ఒక బిడ్డనే కన్నాడు”
Badruddin Ajmal: అస్సాంకు చెందిన AIUDF అధినేత బద్రుద్దిన్ అజ్మల్..అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై (Himanta Biswa Sarma) షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆయనకు ఒంట్లో పవర్ లేకనే ఒక బిడ్డనే కన్నాడని.. కానీ తాను మాత్రం ఏడుగురిని కన్నానని అన్నారు. ఇంతకీ అజ్మల్ ఇలా ఎందుకు అన్నారంటే.. కొన్ని రోజుల క్రితం హిమంత అజ్మల్‌పై కామెంట్స్ చేసారు.
ముస్లింలు వివిధ వివాహాలు చేసుకుంటారు కాబట్టి.. ఒకవేళ అజ్మల్‌కు మళ్లీ వివాహం చేసుకోవాలని ఉంటే ఇప్పుడే చేసుకోవాలని లోక్ సభ ఎన్నికల తర్వాత మళ్లీ భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వస్తుంది కాబట్టి అప్పుడు పౌరసత్వ చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి అప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే రూల్ ప్రకారం జైలుకి వెళ్లాల్సి వస్తుందని కవ్వించారు. హిమంత ఇలా అనడంతో అజ్మల్ తనదైన శైలిలో సెటైర్ వేసారు.
“” హిమంతకు ఒంట్లో పవర్ లేదు కాబట్టే ఒక బిడ్డను కన్నాడు. నేను ఏడుగురు పిల్లల్ని కన్నాను. వారిలో కొందరికి 40 ఏళ్లు వచ్చాయి. ఇంకొందరు కుర్రాళ్లు. నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంటే సీఎం అనుమతి నాకు అవసరం లేదు “” అని స్పందించారు అజ్మల్