Ayyanna Patrudu: చంద్రబాబు అరెస్ట్‌పై మోదీ ఎందుకు మాట్లాడట్లేదు?
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు (ayyanna patrudu). ఆయన స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. తమ నాయకుడు జైల్లో ఉన్నారు కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనేది ప్రతి జిల్లా ఇన్‌ఛార్జితో మాట్లాడి నిర్ణయిస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని తెలిసినప్పుడు ఆయనకు ఫోన్ చేసి ఎందుకు సర్ ఈ రాజకీయాలు హాయిగా ఇంట్లో భార్యాపిల్లలతో ఎంజాయ్ చేయక అని చెప్పాలనిపించింది అని కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదని అన్నారు. డిసెంబర్, జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు రావచ్చని ఈసారి జగన్‌ను తరిమికొట్టి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.